Wanindu Hasaranga | హసరంగ మళ్లీ దూరం.. వన్డే సిరీస్‌లో శ్రీలంక నిలబడేనా..!
Wanindu Hasaranga : ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోతున్న శ్రీలంకు మరో షాక్. అసలే.. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు లోనైన బాధ నుంచి తేరుకోకముందే.. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) వన్డేలకు దూరమయ్యాడు.
Wanindu Hasaranga : ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోతున్న శ్రీలంకు మరో షాక్. అసలే.. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు లోనైన బాధ నుంచి తేరుకోకముందే.. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) వన్డేలకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌కు ముందే కారణంగా ఈ సీనియర్ ఆల్‌రౌండర్ స్వదేశానికి రానున్నాడు. ఈ విషయాన్ని గురువారం లంక క్రికెట్ వెల్లడించింది.
శ్రీలంక స్పిన్ అస్త్రంగా పేరొందిన వనిందు హసరంగ మరో ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల కాలంలో తరచూ గాయాలతో జట్టుకు దూరమవుతున్న ఈ మిస్టరీ బౌలర్ .. ఈసారి కూడా రిహాబిలిటేషన్‌లో ఉండనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి వన్డేకు ముందు నెట్స్‌లో హసరంగ ఇబ్బందిపడడమే అందుకు కారణం. బౌలింగ్ చేస్తుండగా.. వెన్ను కింది భాగంలో నొప్పి మొదలైంది. దాంతో అతడు తొలి వన్డే ఆడలేదు. అనంతరం పరీక్షలు నిర్వహించగా.. వైద్యులు విశ్రాంతి సూచించారు. దాంతో.. వన్డే సిరీస్ మొత్తం హసరంగ అందుబాటులో ఉండడని లంక క్రికెట్ తెలిపింది.
JUST IN 🚨
Wanindu Hasaranga ruled out of the remainder of the ODI series against England.
He experienced lower back pain during a practice session and will return home to begin his rehabilitation programme.#ENGvSL pic.twitter.com/fex3NDFfvV
— Cricbuzz (@cricbuzz) September 24, 2026
మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన హసరంగ.. అప్పటి నుంచి ఆడింది కొన్ని మ్యాచ్‌లే. ప్రపంచకప్ లీగ్ దశ ఐర్లాండ్‌పై మూడు వికెట్లతో మెరిసిన హసరంగ.. గాయంతో టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరుగుతున్న తొలి వన్డేలో కెప్టెన్ కుశాల్ మెండిస్(121) శతకంతో.. లంక 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

