Bigg Boss | బిగ్ బాస్ తెలుగు 10కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం!
Bigg Boss | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పవర్ఫుల్ ప్రోమోతో పాటు 'అగ్నిపరీక్ష' అనే థీమ్‌ను కూడా రివీల్ చేయడంతో షోపై అంచనాలు మరింత పెరిగాయి.
Bigg Boss | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పవర్ఫుల్ ప్రోమోతో పాటు ‘అగ్నిపరీక్ష’ అనే థీమ్‌ను కూడా రివీల్ చేయడంతో షోపై అంచనాలు మరింత పెరిగాయి. తాజా పోస్ట్ లో ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తే అగ్నిపరీక్ష… చరిత్ర సృష్టించబోయేది ఎవరు? అనే ట్యాగ్‌లైన్‌తో సీజన్ కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పదో సీజన్ కావడంతో ఈసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా షోను రూపొందించినట్లు తెలుస్తోంది. ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్‌లో భాగంగా కంటెస్టెంట్లకు గత సీజన్ల కంటే మరింత కఠినమైన టాస్కులు, అనూహ్యమైన ట్విస్టులు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే పోటీదారులకు గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి గేమ్ మరింత కఠినంగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈసారి టెలివిజన్ ప్రేక్షకులతో పాటు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టార్ మా ఛానెల్లో ప్రసారం కావడంతో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ వేదికలో 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండనుంది. దీంతో హౌస్‌లో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం లభించనుంది.
ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో బిగ్ బాస్ హౌస్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. గత కొన్ని సీజన్లలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈసారి కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్ల జాబితాపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. టీవీ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక జాబితాను మాత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రోజునే ప్రకటించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ తెలుగు 10 – అగ్నిపరీక్ష’ మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. కొత్త థీమ్, కొత్త టాస్కులు, అనూహ్య ట్విస్టులతో ఈ సీజన్ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

