టీజీఎంఎస్ఐడీసీ టెండర్లలో గోల్మాల్
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది.
- నకిలీ ధ్రువపత్రాలతో టెండర్ కొల్లగొట్టే యత్నం
- రూ.4 కోట్ల సక్షన్ ఆపరేటస్ టెండర్లో భారీ కుంభకోణం
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. ప్రభుత్వ దవాఖానలకు మందులు, పరికరాలు, సర్జికల్స్, రీ ఏజెంట్లను సరఫరా చేసే టీజీఎంఎఐస్ఐడీసీలో అధికారుల కమీషన్ల పర్వం, మందుగోళీల స్కామ్, టెండర్ ప్రక్రియలో ఇటీవల వెలుగు చూసిన అవినీతి బాగోతాలు మరువకముందే ఓ సప్లయర్ నిబంధనల ఉల్లంఘన వెలుగు చూసింది. నిరుడు జూన్‌లో నిర్వహించిన రూ.4 కోట్ల సక్షన్ ఆపరేటస్ టెండర్లో ఓ సప్లయర్ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి టెండర్ దక్కించుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది.
అనంతపురం జిల్లాలోని ఓ దవాఖానకు స్పైన్ బోర్డులు(30), ఎస్ఎస్ స్క్రబ్(20), సక్షన్ ఆపరేటస్(5) సరఫరా చేసినట్టు సదరు సప్లయర్ ఇన్వాయిస్లో పొందుపర్చారు. 2022-23లో సరఫరా చేసినట్టు పేర్కొన్న ఈ పరికరాలకు జీఎస్టీ 18%గా పేర్కొనగా.. సక్షన్ ఆపరేటస్ల జీఎస్టీ 12 % ఉండటం గమనార్హం. వరంగల్‌లోని ఓ దవాఖానకు 10 సక్షన్ ఆపరేటస్లను సైప్లె చేసినట్టు ఇన్వాయిస్లో పొందుపర్చగా.. ధరల కాలమ్ దిద్దడం, యూనిట్ ధర నాలుగు అంకెల్లో ఉండటం, మొత్తం ధర ఆరు అంకెల్లో ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.
కర్నూలులోని రెండు ప్రైవేట్ దవాఖానలకు సరఫరా చేసిన సక్షన్ ఆపరేటస్లకు 28% జీఎస్టీ వసూలు చేసినట్టు పేర్కొనడం విస్తుగొలుపుతున్నది. గతంలో దవాఖాన, ఫర్నిచర్ టెండర్ కొనుగోలులో నిబంధన మార్చాలని ఆ సప్లయర్ హైకోర్టుకు వెళ్లినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే సప్లయర్‌కు టెండర్ దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
టిమ్స్ పరికరాల్లో సైతం..
గతంలో ఇదే సప్లయర్ సనత్‌నగర్ టిమ్స్‌కు సరఫరా చేసిన పరికరాల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. శవాలను భద్రపరిచే మార్చురీ కూలర్లు(5), స్టీమ్ స్టెరిలైజర్ యూనిట్లు(5), ప్లాస్మా స్టెరిలైజర్లు(2), వాషర్ డిసిన్ఫెక్టర్ విత్ యాక్ససరీస్(4), ైస్టెరిలైజ్డ్ పరికరాలు, రోటరీ హీట్ సీలర్(4), అల్ట్రా సోనిక్ క్లీనర్(3), సెలెక్టా స్ప్రే గన్(4), మాన్యువల్ ట్రే వాష్ (1), ఇన్స్పెక్షన్ మ్యాగ్నిఫయింగ్ ల్యాంప్ (4), మల్టీ రోల్ టేప్ డిస్పెన్సర్(4), సెంట్రల్ స్టెరైల్ ఫర్మిచర్(1)లో సైతం టెండర్ బ్రాండ్లను కాదని తక్కువ ధరలకు కొనుగోలు చేసి సరఫరా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం రూ.12 కోట్లు వెచ్చించి ఆయా పరికరాలను కొనాల్సి ఉండగా.. రూ.4 కోట్లు వెచ్చించి నాసిరకం పరికరాలను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లలో సైతం నాసిరకం పరికరాలను కొనేందుకు ఆయా కంపెనీలు ఇదే సప్లయర్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

