Stampede : శ్రావణ సోమవారం (Sravanam Monday) కావడంతో ఆ ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. అదే సమయంలో కరెంటు వైర్ (Electric Wire) తెగిపడటంతో భక్తులు (Devotees) భయంతో పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. బీహార్ రాష్ట్రం (Bihar State) లఖిసరాయ్ జిల్లా (Lakhisarai district) లోని అశోక్‌ధామ్ ఆలయం (Ashok Dham temple) లో ఈ విషాద ఘటన జరిగింది.
శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో లఖిసరాయ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం అయిన అశోక్ధామ్కు భక్తులు పోటెత్తారు. అయితే అనూహ్యంగా భక్తులపై కరెంటు వైర్ తెగిపడి విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.