Supreme Court | బస్సులు, పార్కులను ప్రమాదకర జోన్లుగా ఎలా మార్చగలం : సుప్రీంకోర్టు
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi), దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలపై సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనలను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణకు తీసుకుని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తాకుంజ్ పార్కులో, స్వరూప్ నగర్లో, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సులో గ్యాంగ్‌రేప్ ఘటనలు వెలుగుచూశాయి.
Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ (Delhi), దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలపై సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనలను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణకు తీసుకుని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తాకుంజ్ పార్కులో, స్వరూప్ నగర్లో, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సులో గ్యాంగ్‌రేప్ ఘటనలు వెలుగుచూశాయి.
ఈ వరుస ఘటనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణను ప్రారంభించింది. 2012 నాటి నిర్భయ కేసుతో పోలిక తీసుకురాకుండా ఉండలేకపోతున్నామని వ్యాఖ్యానించింది. ఆ కేసు నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నది. ప్రజాభద్రతకు హామీ ఉన్నప్పటికీ, గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ, ఈ లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.
పెట్రోలింగ్, నిఘా సరిగాలేదని చెప్పి రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు, పార్క్‌ల వంటివాటిని అధిక ప్రమాద జోన్లుగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తాకుంజ్ ఘటనలో లైంగిక వేధింపులపై విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకోలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. భద్రతా లోపాలను సరిదిద్దడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
శాంతి భద్రతలను కాపాడంలో, ప్రజా భద్రతకు హామీ ఇవ్వడంలో వ్యవస్థాగత వైఫల్యాలు ఈ ఘటనలతో తేటతెల్లం అవుతున్నాయని కోర్టు మండిపడింది. బాధ్యాయుత స్థానాల్లో ఉన్నవారిని జవాబుదారీ చేయడం అవసరమని స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

