Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Punjab Cops Plant Drugs | మత గురువైన శివసేన నేత ఇంట్లోని బెడ్ పరుపు కింద డ్రగ్స్ ప్యాకెట్‌ను ఒక పోలీస్ అధికారి ఉంచాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అయితే రహస్య కెమెరాలో రికార్డైన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
చండీగఢ్: మత గురువైన శివసేన నేత ఇంట్లోని బెడ్ పరుపు కింద డ్రగ్స్ ప్యాకెట్‌ను ఒక పోలీస్ అధికారి ఉంచాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అయితే రహస్య కెమెరాలో రికార్డైన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. (Punjab Cops Plant Drugs) పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖన్నా పట్టణానికి చెందిన మత గురువు, పంజాబ్ శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి వాహన డ్రైవర్ గుర్జంత్ సింగ్ 7.5 గ్రాముల హెరాయిన్‌తో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తర్వాత ఆ మహంత్ పేరు బయటకు వచ్చింది.
కాగా, ఒక పోలీస్ బృందం మహంత్ నివాసానికి చేరుకున్నది. ఆయన ఇంట్లో సోదా చేయగా మంచం పరుపు కింద 30 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్ లభించింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మహంత్ గిరిని అరెస్ట్ చేశారు.
అయితే మహంత్ ఇంట్లో రహస్యంగా అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఆ ఇంట్లో పోలీసుల సోదాలకు ముందు సివిల్ డ్రెస్‌లో ఉన్న ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ ఆ గదిలోకి ప్రవేశించారు. మంచం పరుపు కింద ఒక ప్యాకెట్‌ను ఆయన ఉంచినట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది.
మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో పంజాబ్‌లో రాజకీయంగా కలకలం చెలరేగింది. పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసు విచారణ నుంచి ఆయనను తొలగించారు. ఈ వ్యవహారంలో ఇతర పోలీసు సిబ్బంది ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసిన మహంత్ కశ్మీర్ గిరిని కూడా ఆ కేసు నుంచి విడుదల చేశారు.
కాగా, ఈ సంఘటన పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు దారితీసింది. అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసుల తీరుతో పాటు సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ‘పంజాబ్ ‘ఆప్’ ఇంటికే సేవలు అందిస్తామని వాగ్దానం చేసింది. కానీ పౌరులను ఇరికించడానికి పంజాబ్ పోలీసులు ఇంటికే డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తారని ఎవరికి తెలుసు?’ అని ఎద్దేవా చేశారు.
Welcome to the AAP model of “Law & Order”!
Khanna Police ASI was caught live on CCTV secretly hiding a packet of drugs under a mattress inside a home!
@AAPPunjab promised home delivery of services, but who knew it included home-delivered drugs by the Punjab Police to frame citizens?
Is this how Punjab Police delivers “Badlav” under your supervision, Guru Dokhi @BhagwantMann?
#PunjabVirodhiAAP— Sukhbir Singh Badal (@officeofssbadal) November 2, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

