Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Viral dance | వేడుకలు, కార్యక్రమాల్లో సరదాగా చేసే పనులు ఒక్కోసారి ఊహించని గుర్తింపు తెచ్చిపెడతాయి. చండీగఢ్ (Chandigarh) కు చెందిన ఓషీన్ పాండ్యా (Osheen Pandiya) అనే యువతి విషయంలో సరిగ్గా అదే జరిగింది. తన ఆఫీసులో జరిగిన దీపావళి వేడుకల (Diwali Celebrations) లో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.
Viral dance : వేడుకలు, కార్యక్రమాల్లో సరదాగా చేసే పనులు ఒక్కోసారి ఊహించని గుర్తింపు తెచ్చిపెడతాయి. చండీగఢ్ (Chandigarh) కు చెందిన ఓషీన్ పాండ్యా (Osheen Pandiya) అనే యువతి విషయంలో సరిగ్గా అదే జరిగింది. తన ఆఫీసులో జరిగిన దీపావళి వేడుకల (Diwali Celebrations) లో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్ల (20 మిలియన్లు) వ్యూస్ వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఓషీన్ పాండ్యా తన ఆఫీసు దీపావళి వేడుకల్లో భాగంగా 2012లో వచ్చిన ‘ఇషక్జాదే’ సినిమాలోని ‘ఝల్లా వల్లా’ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. నీలం, ఆకుపచ్చ రంగు సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె వేసిన స్టెప్పులకు సహోద్యోగులు కేరింతలతో ప్రోత్సహించారు. ఈ సరదా క్షణాలకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్చేసింది. “ఆఫీస్ దీపావళి పార్టీలో ఒక డ్యాన్స్ అయితే చేయాలి కదా” అనే క్యాప్షన్‌తో ఓషీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, ముఖంలో చిరునవ్వు, పండుగ ఉత్సాహం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఆమె ఆఫీస్ క్రష్‌గా మారిపోయింది’ అంటూ చాలామంది కామెంట్లు చేశారు. లక్షల సంఖ్యలో లైకులు, ప్రశంసలతో ఈ వీడియో ఆఫీసుల్లో జరిగే చిన్నచిన్న సంతోషకరమైన క్షణాలకు ప్రతీకగా నిలిచింది. ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

