Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Viral News | ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టిన వ్యక్తి, వందల మంది ముందు ప్రసంగించిన నాయకుడు అమ్మ దగ్గరకు వచ్చేసరికి సామాన్యుడే అయ్యాడు. అతనెవరో కాదు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పక్కన కూర్చొని ఆయన వేణుగానం చేశారు.
Viral News : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టిన వ్యక్తి, వందల మంది ముందు ప్రసంగించిన నాయకుడు అమ్మ దగ్గరకు వచ్చేసరికి సామాన్యుడే అయ్యాడు. అతనెవరో కాదు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పక్కన కూర్చొని ఆయన వేణుగానం చేశారు. పిల్లనగ్రోవితో మధురమైన స్వరాలు పలికించారు. ఆ సంగీతం వింటుంటే తల్లి ముఖంలో చిరునవ్వు విరబూసింది. అందుకు సంబంధించిన ఫొటోను అర్జున్ ముండా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఆ ఫొటో నెటిజన్ల మనసులను గెలుచుకున్నది. అర్జున్ ముండా తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఆమెకు ధైర్యం చెప్పేందుకు, కాస్త ఆనందాన్ని పంచేందుకు అర్జున్ ముండా ఆమె పక్కనే కూర్చున్నారు. అనంతరం పిల్లనగ్రోవి తీసుకుని మెల్లగా స్వరాలు పలికించారు. ఆ మధురమైన సంగీతం వింటూ తల్లి ముఖంలో చిరునవ్వు కనిపించింది. తల్లి పక్కన కొడుకు, ఆ కొడుకు చేతిలో పిల్లనగ్రోవి, ఆసుపత్రి గదిలో ప్రతిధ్వనించిన స్వరాలు.. ఈ చిత్రం చూపరుల మనుసులను కదిలిస్తున్నది.
ఆ పోస్టుతోపాటు అర్జున్ ముండా తన తల్లి గురించి భావోద్వేగ సందేశం రాశారు. ‘అమ్మ నా జీవితంలో అత్యంత విలువైన ఆశీర్వాదం. ఆమె ప్రేమే నా గొప్ప బలం. ఆమె ఆశీస్సులే నాకు అండ. ఆమె జీవితం నాకు అతిపెద్ద ప్రేరణ’ అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఆయనలోని ఓ ప్రేమగల కొడుకు కనిపించారు. జీవితంలో ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా అమ్మదగ్గర మనిషి చిన్నపిల్లవాడే. ఒకప్పుడు మనకోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మకు ఆమెకు అవసరమైనప్పుడు మనం పక్కన ఉండటమే పెద్ద ఓదార్పు.
మాటలతో చెప్పలేని ప్రేమను కొన్నిసార్లు ఓ చిన్న స్పర్శ, ఓ చిరునవ్వు, ఓ మధురమైన పాట చెప్తాయి. అర్జున్ ముండా పిల్లనగ్రోవి స్వరాలు కూడా అదే భావాన్ని పలికించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పలువురిని కదిలిస్తున్నది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

