LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
LuLu Mall | కూకట్‌పల్లిలోని ప్రముఖ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ కేంద్రమైన లూలూ మాల్.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన పండుగ షాపింగ్ వేడుకలను ఘనంగా ప్రారంభించింది. హ్యాపీ షాపింగ్ అవర్స్, అద్భుతమైన డిస్కౌంట్లు, ప్రత్యేకమైన ఆకర్షణలతో ఈ దీపావళికి సరికొత్త పండుగ వాతావరణాన్ని అనుభవించండంటూ కస్టమర్లను ఆహ్వానిస్తున్నది.
LuLu Mall : కూకట్‌పల్లిలోని ప్రముఖ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ కేంద్రమైన లూలూ మాల్.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన పండుగ షాపింగ్ వేడుకలను ఘనంగా ప్రారంభించింది. హ్యాపీ షాపింగ్ అవర్స్, అద్భుతమైన డిస్కౌంట్లు, ప్రత్యేకమైన ఆకర్షణలతో ఈ దీపావళికి సరికొత్త పండుగ వాతావరణాన్ని అనుభవించండంటూ కస్టమర్లను ఆహ్వానిస్తున్నది. ప్రతి గంటకు రూ.1,000 విలువైన గిఫ్ట్ కార్డు గెలుచుకునే అవకాశం కోసం లూలూ హైపర్‌మార్కెట్, లూలూ ఫ్యాషన్ స్టోర్, లూలూ కనెక్ట్‌లో షాపింగ్ చేయండంటూ వెల్కమ్ చెబుతోంది. అయితే లూలూ మాల్లో ప్రధాన ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ విధంగా ఉన్నాయి.
లూలూ హైపర్‌మార్కెట్
హోమ్ మేకోవర్ : నిత్యావసరాలు, గృహోపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపు.
ఫెస్టివ్ లైటింగ్ & డెకర్ : దీపంతలు, లైట్లు, రంగోలికి కావాల్సిన వస్తువులు, అసలైన అలంకరణ వస్తువులపై 60 శాతం వరకు తగ్గింపు.
గ్రాండ్ స్వీట్ కౌంటర్ : ఈ సీజన్ ప్రధాన ఆకర్షణగా 50 రకాలకుపైగా సాంప్రదాయ స్వీట్లు, పండుగ ప్రత్యేక వంటకాలు, ప్రీమియం డ్రై ఫ్రూట్ బాక్సులపై 50 శాతం వరకు తగ్గింపు.
లూలూ ఫ్యాషన్ స్టోర్
భారీ ఆదా : జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, ఫ్యాషన్ లేబుల్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు.
బ్యూటీ & యాక్సెసరీస్ : బ్యూటీ ఉత్పత్తులు, బ్రాండెడ్ సన్గ్లాసెస్పై 50 శాతం వరకు తగ్గింపు. మీ వార్డ్రోబ్ అప్గ్రేడ్లను, పండుగ బహుమతులను మునుపెన్నడూ లేనంత సరసమైన ధరల్లో ఇళ్లకు తీసుకెళ్లవచ్చు.
లూలూ కనెక్ట్
ఎలక్ట్రానిక్స్ & అప్లయన్సెస్ : టీవీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న గృహోపకరణాలపై 50 శాతం తగ్గింపు.
సులభమైన చెల్లింపు : ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌లు, సులభమైన EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కిడ్స్ జోన్ : షాపింగ్‌కు విరామం ఇచ్చి కిడ్స్ జోన్ ఫంటురాలో హై-ఎనర్జీ రైడ్స్, ఆర్కేడ్ గేమ్‌లను ఆస్వాదించవచ్చు — 2X ఆఫర్. కనీసం రూ.2000 అంతకంటే ఎక్కువ లోడ్ చేసి మీ కార్డును డబుల్ చేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

