Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, ఆ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, ఆ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలో విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగుల కమలాకర్‌తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు బొట్టుపెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు.
మంకమ్మతోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల, ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వారి పేర్లతో ఆత్మీయంగా పలకరిస్తూ దీక్షా దివస్ సభకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్ర ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించారు. నాయకులు స్వయంగా ఇంటింటికీ వచ్చి బొట్టుపెట్టి, ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానించడంతో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు ప్రజలు నాయకులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ దీక్షా దివస్ సభకు తప్పకుండా హాజరవుతామని, సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మాటిచ్చారు. ప్రజల నుంచి లభించిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కేసీఆర్ దీక్షతోనే ఉద్యమానికి మలుపు
1969 నుంచి 1972 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పటికీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరలేదని, అనంతరం దశాబ్దాల పాటు తెలంగాణ అంశం రాజకీయ పార్టీల పదవుల రాజకీయాల్లో నలిగిపోయిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ ఆకాంక్షలను ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కేసీఆర్ దీక్షను విరమింప జేసేందుకు అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం మరింత ఉధృతమైందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చరిత్రాత్మక మలుపుగా నిలిచిందన్నారు.
దీక్షా దివస్ ప్రజల పండుగ
నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ గడ్డపై నిర్వహించే ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయడంతోపాటు రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలను స్మరించుకోవడమే దీక్షా దివస్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రజలంతా భాగస్వాములు కావాలి
దీక్షా దివస్ సభను విజయవంతం చేయడానికి నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బొట్టుపెట్టి, వారి పేర్లతో ఆత్మీయంగా పలకరిస్తూ సభకు ఆహ్వానిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు సైతం సభకు తప్పకుండా హాజరవుతామని హామీ ఇస్తున్నారని తెలిపారు. రేపు దప్పు చాటింపు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా సమాచారం అందించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకునే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, గందే మాధవి, నందేల్లి రమాదేవి, పార్టీ డివిజన్ అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
Jobs | చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో 41 ఖాళీలు.. డిసెంబర్ 3 చివరితేదీ
Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’.. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
BRS | నాగార్జునసాగర్ నుంచి పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఆపాలి.. కృష్ణా బోర్డుకు బీఆర్ఎస్ ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

