Karthika Deepotsavam | 24న తిరుమలలో కార్తీక దీపోత్సవం.. గరుడ సేవ రద్దు
Karthika Deepotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక దీపోత్సవాన్ని(Karthika Deepotsavam) నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD ) అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఉంటుందని వివరించారు.
అనంతరం వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తిరమల కొండపై ఉన్న ఆలయాల వద్ద దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్తీకమాసం సందర్భంగా గరుడ సేవను , సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Deepotsavam | 24న తిరుమలలో కార్తీక దీపోత్సవం.. గరుడ సేవ రద్దు
Water Board | జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు: వీడియో
ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
Jobs | చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో 41 ఖాళీలు.. డిసెంబర్ 3 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

