Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Class 3 boy hits KG girl | ఒక ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా ప్రవర్తించాడు. యూకేజీ చదువుతున్న బాలికను ఖాళీ క్లాస్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లాడు. పూలకుండీ, ఇటుక రాయితో ఆమె తలపై కొట్టాడు. బాలుడి దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నది.
చండీగఢ్: ఒక ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా ప్రవర్తించాడు. యూకేజీ చదువుతున్న బాలికను ఖాళీ క్లాస్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లాడు. పూలకుండీ, ఇటుక రాయితో ఆమె తలపై కొట్టాడు. బాలుడి దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నది. (Class 3 boy hits KG girl) హర్యానాలోని పంచకులలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 28న సంస్కృతి మోడల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు, కిండర్ గార్టెన్ చదువుతున్న 6 ఏళ్ల బాలికను మొదటి అంతస్తులోని ఖాళీగా ఉన్న తరగతి గదిలోకి ఈడ్చుకెళ్లాడు. ఆమె తలను బల్లపై రెండుసార్లు బాదాడు. ఆ చిన్నారిని నేలపై పడేసి కాలి బూటుతో తన్నాడు. ఆ తర్వాత ఇటుక రాయితో, పూలకుండీతో ఆ బాలికపై దాడి చేశారు. ఆ చిన్నారి స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉన్నప్పటికీ ఆ బాలుడు ఆగలేదు. క్లాస్ నేలపై పడి ఉన్న ఆ బాలిక తలపై పలుమార్లు ఇటుక రాయితో దాడి చేశాడు.
కాగా, ఈ సంఘటన తర్వాత ఆ బాలుడు క్లాస్రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. బాలికను ఇంటికి తీసుకువెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ బాలుడు వారిని మొదటి అంతస్తులోని క్లాస్రూమ్ వద్దకు తీసుకెళ్లాడు. ‘మీ అమ్మాయి ఇక్కడ పడి ఉన్నది’ అని వారితో చెప్పినట్లు తెలుస్తున్నది.
మరోవైపు క్లాస్‌రూమ్‌లో గాయాలతో పడి ఉన్న కుమార్తెను చూసి బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తొలుత సెక్టార్ 6లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. బాలిక తలకు తీవ్ర గాయాలు కావడంతో చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. ఈ సంఘటనపై వివరాలు సేకరించారు. చిన్న వయసున్న బాలుడు ఇలాంటి దారుణానికి ఎలా పాల్పడ్డాడో అని పోలీసులు షాక్ అయ్యారు. ఆ బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కూల్ యాజమాన్యం పర్యవేక్షణ, నిర్లక్ష్యం ఆరోపణలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియోను పరిశీలిస్తున్నారు.
కాగా, హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా ఈ షాకింగ్ సంఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. తగిన చర్యలు తీసుకుంటాం’ అని మీడియాతో అన్నారు.
⚠️ TRIGGER WARNING: DISTURBING INCIDENT INVOLVING MINOR CHILDREN
Panchkula, Haryana: 8-Year-Old Student Allegedly Assaults 6-Year-Old Girl With Special Needs Inside School, Victim Critically Injured.
A disturbing incident has been reported at Sanskriti Model School in Sector 20, Panchkula, where an 8-year-old Class 3 student allegedly attacked a 6-year-old KG girl with special needs.
According to reports, the accused student allegedly grabbed the girl’s hair, slammed her head against a desk and repeatedly attacked her with bricks and a flowerpot. Even after the child reportedly lost consciousness, he allegedly continued dragging and kicking her.
The injured girl was rushed for medical attention and later referred to PGI Chandigarh due to her critical condition.
Police have initiated an investigation to establish the exact sequence of events and circumstances surrounding the incident.
The incident has raised serious concerns over child safety, staff supervision and security arrangements inside schools, particularly when it comes to protecting younger and vulnerable students.
— Deadly Kalesh (@Deadlykalesh) October 31, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

