Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
Punjab | పంజాబ్ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్విజ్ పోటీ (Quiz Competition) పెట్టనుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. క్విజ్ పోటీ నిర్వహణ పెద్ద విషయం కాకపోయినా ఆ పోటీలో గెలిచిన వారికి రూ.కోటి బహుమతి ఇస్తామని ప్రకటనలో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
Punjab : పంజాబ్ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్విజ్ పోటీ (Quiz Competition) పెట్టనుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. క్విజ్ పోటీ నిర్వహణ పెద్ద విషయం కాకపోయినా ఆ పోటీలో గెలిచిన వారికి రూ.కోటి బహుమతి ఇస్తామని ప్రకటనలో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని యువతను ప్రోత్సహించడానికి ‘పంజాబ్ దా కరోడ్‌పతి (Punjab Da Crorepati)’ అనే క్విజ్ పోటీని ప్రారంభించినట్లు సీఎం భగవంత్ మాన్ (CM Bhagawant Mann) అన్నారు.
పంజాబ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, గణితం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాలపై ప్రశ్నలు ఉంటాయని పంజాబ్ సీఎం తెలిపారు. ఇందులో విజేతకు రూ.1 కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. రన్నరప్‌లుగా నిలిచిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతులు ఇస్తామన్నారు. ఇందులో పాల్గొన్న దాదాపు 10 వేల మంది యువతకు ఇతర బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 15-30 ఏళ్ల మధ్య వయస్సుగల యువతీయువకులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) తెలిపారు. ఇందుకోసం పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల పేర్లను నమోదు చేయాలని సూచించారు. ఈ క్విజ్‌లో మొత్తం 11 రౌండ్లు ఉంటాయి. వాటిలో తొమ్మిది రౌండ్లు ఆన్లైన్ పోర్టల్ ద్వారా, రెండు రౌండ్లు ప్రత్యక్షంగా జరుగుతాయి. టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తరహాలోనే ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పదో రౌండ్ 23 జిల్లాల్లో నిర్వహిస్తారు. అక్కడి టాపర్లు గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
Son Stabs Mother | తల్లిని కత్తితో పొడిచిన బాలుడు.. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య
OTT Releases | రణబాలి, జైలర్ 2.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

