Bhogapuram Airport | భోగాపురం విమానాశ్రయంలో ల్యాండైన తొలి విమానం.. తొలి సర్వీస్ హైదరాబాద్ నుంచే!
Bhogapuram Airport | భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం సోమవారం ఉదయం భోగాపురం చేరుకుంది.
Bhogapuram Airport | భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయంలో సోమవారం నుంచి దేశీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం సింగపూర్‌కు బయల్దేరడంతో సేవలు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం భోగాపురం చేరుకుంది. విమానాశ్రయ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికారు. వారికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు. అనంతరం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ తదితర ప్రాంతాలకు విమానాలు బయల్దేరాయి.
పలు నగరాలకు సర్వీసులు
భోగాపురం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్ఇండియా, స్కూట్ ఎయిర్‌లైన్స్ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా విమాన సదుపాయం అందుబాటులో ఉంటుంది. సోమవారం మొత్తం 31 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకల కోసం 20 విద్యుత్ బస్సులను ఏర్పాటు చేశారు.
విశాఖ విమానాశ్రయంలో సేవలు నిలిపివేత
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కావడంతో విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 10.45 గంటలకు దిల్లీకి చివరి విమానం బయల్దేరింది. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటివరకు పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది సిబ్బంది భవిష్యత్తులో ఎక్కడ సేవలందిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

