MP Vaddiraju Ravichandra | జూరాల నీళ్లు అడిగితే బీఆర్ఎస్ నాయకులను నిర్బంధంలో ఉంచారు. జూరాల నీళ్లను ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు ..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రైతులు బాధపడుతుంటే ప్రాజెక్టు నిండా నీళ్లు.. రైతుల కండ్లల్లో కన్నీళ్లు.. ఈ బాధను చూడలేక మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది మంది రైతులు జూరాలను సందర్శించి ఆ నీళ్లను మాకెందుకు వదలరు. మాకు వదిలిపెట్టండి అని మొర పెట్టుకొని ప్రాజెక్టుకు పోదామంటే మా నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తారు. అంటే నీళ్లడిగితే నిర్భంధమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు. బీసీలకు మంత్రి పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. సమైక్య పాలకులకు బుద్ది చెప్పే విధంగా కేసీఆర్ కరెంటు ఇచ్చారన్నారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. 22ఏ అంశంలో రైతులు, బీసీలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ చెరో 8 మంది ఎంపీలు ఉన్నారు హనీమూన్ లాగా ఇక్కడ ఎంపీలు బస్సులు వేసుకుని తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా,పాకిస్తాన్ విభజనతో పోల్చినా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు కాంగ్రెస్ ఎంపీలకు భూములు, ఫామ్ హౌస్‌లు లేవా…? జెన్ జీ విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు. పోలీసులు అతిగా వ్యవహరించవద్దు. జూరాలలో త్రాగు నీటికి 9 టీఎంసీలు అవసరం లేదు. తాగునీటి అవసరాల పేరుతో పంటలు ఎండబెట్టొద్దు.
గోదావరిలో ఏపీకి నీళ్లను ఎందుకు వదిలిపెడుతున్నారు..మేడిగడ్డ రెండు పిల్లర్లను రిపేర్ చేసే తెలివి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది.. ఇపుడు కూడా కన్నె పల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశమున్నా చేయడం లేదన్నారు. సీజన్ ప్రారంభం లోనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఉంటే సాగు తాగు నీళ్లకు కొరత ఉండేది కాదన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం@vaddirajumprs @drsanjayBRS https://t.co/P2tJuUurRx
— BRS Party (@BRSparty) September 21, 2026
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం