జై నూర్ : స్వతంత్ర భారతదేశంలో ఉన్న హక్కులను ఏజెన్సీ ప్రాంత ( Agency Areas ) దళితులకు కల్పించాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ జిల్లా అధ్యక్షుడు దౌనే ప్రకాష్ ( Prakash ) కోరారు. సోమవారం జైనూరు ( Jainoor ) మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీల భూములకు ( SC Lands ) వెంటనే పహానీలు ఇప్పించి బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించాలని అన్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఎస్సీల కు ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మా వాడే దత్త, ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబళే అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శంకర్, మండల ఉపాధ్యక్షుడు వాగుమరి సంబాజీ, కోటంబె శ్రీహరి, వాగ్మారే సంగ్రామ్, దేవ్ కామ్రే సాయిబ్ రావ్, కొమ్లే ప్రకాష్, గైక్వాడ్ మాధవ్, వాగ్మారే పరశురాం, ప్రకాష్ పాల్గొన్నారు.