తాండూరు : మంచిర్యాల జిల్లా తాండూరు ( Tandur ) మండల కేంద్రంలో
శ్రీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి నటరాజ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన ‘ వినాయక జన్మ రహస్య’ (Vinayaka Janma Rahasyam ) నృత్య రూపకం ( Dance Feature ) విశేషంగా ఆకట్టుకుంది.

నృత్య గురువు అల్లాడి అర్చన జయప్రకాశ్ శిక్షణలో విద్యార్థులు భక్తి, నృత్యం, అభినయంతో వినాయకుడి జన్మ వృత్తాంతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. కూచిపూడి నృత్య శైలిలో సాగిన ఈ నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించిం ది. వినాయకుడి జననం, పార్వతీదేవి సృష్టి, శివపార్వతుల కథాంశాలను నృత్యం, అభినయం, సంగీతంతో విద్యార్థులు చక్కగా ఆవిష్కరించారు. ప్రదర్శన అనంతరం విద్యార్థులను నిర్వాహకులు, సభ్యులు, భక్తులు అభినందిoచి సత్కరించారు.
ఈ సందర్భంగా నటరాజ డ్యాన్స్ అకాడమీ నృత్య గురువు అల్లాడి అర్చన జయప్రకాశ్ మాట్లాడుతూ భారతీయ శాస్త్రీయ నృత్యం ద్వారా హిందూ పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు నృత్య రూపకాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.