KTR | ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం : కేటీఆర్
KTR | జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని రైతుల పక్షాన డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మహబూబ్ నగర్ : జూరాల ( Jurala ) ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని రైతుల పక్షాన డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు ( Palamur ) జిల్లా బీఆర్ఎస్ నేతలను ( BRS Leaders ) అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు.
మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి , న్యాయమైన డిమాండ్ తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోందని విమర్శించారు.
సీఎంగా విఫలమైన రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులని అన్నారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోందని పేర్కొన్నారు. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలున్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపమని వెల్లడించారు. అక్రమంగా అరెస్టుచేసిన బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

