IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
IPS Officer | తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి అశ్లీల వీడియోలు, చిత్రాలు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఆమె అధికారిక వాట్సప్ నంబర్‌కు ఈ నెల 16న రాత్రి అసభ్యకర దృశ్యాలు పంపించినట్లు తెలిసింది.
IPS Officer | తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి అశ్లీల వీడియోలు, చిత్రాలు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఆమె అధికారిక వాట్సప్ నంబర్‌కు ఈ నెల 16న రాత్రి అసభ్యకర దృశ్యాలు పంపించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అధికారిక విధుల్లో భాగంగా సంబంధిత విభాగానికి చెందిన మహిళా ఏఎస్సై ఆ సెల్‌ఫోన్‌ను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ సందేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 16న రాత్రి 8 గంటల సమయంలో గుర్తుతెలియని నంబర్ నుంచి వీడియోలు, చిత్రాలు వాట్సప్‌కు చేరాయి. వాటిని పరిశీలించిన మహిళా ఏఎస్సై అసభ్యకరమైనవిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై మహిళా ఏఎస్సై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసభ్యకర వీడియోలు, చిత్రాలు పంపిన వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారిక నంబర్‌కు ఈ తరహా సందేశాలు రావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

