Mahadev app case | మహదేవ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. బుర్జ్ ఖలీఫాలోని ఫ్లాట్లు, దుబాయ్‌లో ఆస్తులు జప్తు
Mahadev app case | మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఈ కేసులో చురుగ్గా దర్యాప్తు చేస్తున్నది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో పలు ఫ్లాట్లతో సహా 20 స్థిరాస్తులను జప్తు చేసింది.
న్యూఢిల్లీ: మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తున్నది. (Mahadev app case) ఈ కేసులో చురుగ్గా దర్యాప్తు చేస్తున్నది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో పలు ఫ్లాట్లతో సహా 20 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ కొత్తగా అటాచ్ చేసిన ఆస్తులలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాలోని పలు ఫ్లాట్లు ఉన్నాయి. వీటితో పాటు దుబాయ్ హిల్స్ ఎస్టేట్‌లోని కొన్ని విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్లు, బిజినెస్ బే వాణిజ్య జిల్లా, ఎస్ఎల్ఎస్ హోటల్, రెసిడెన్సెస్ లగ్జరీ టవర్లోని పలు ఖరీదైన ఫ్లాట్లతో సహా 18 ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
కాగా, వీటితోపాటు ఢిల్లీలోని రెండు స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్లు ఈడీ అధికారి తెలిపారు. కొత్తగా అటాచ్ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ. 1,700 కోట్లు అని చెప్పారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులని వెల్లడించారు.
మరోవైపు మహాదేవ్ ఆన్లైన్ బుక్ ప్లాట్‌ఫామ్, ఇతర సంస్థల పేరిట జరిగిన అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన నేరం ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ ఆస్తులను నిందితులు కొనుగోలు చేసినట్లు ఈడీ పేర్కొంది. దర్యాప్తులో ఇది వెల్లడి కావడంతో సంబంధిత ఆస్తులను అటాచ్ చేసినట్లు వివరించింది.
Also Read:
Ex-MLA’s Son Charred Body Found | కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహం.. హత్యగా అనుమానం
Kotak Mahindra Fraud | హర్యానాలో ఐడీఎఫ్సీ తర్వాత.. కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ.160 కోట్ల మోసం
USS Abraham Lincoln | హెచ్చరించిన తర్వాత.. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- attaches
- Burj Khalifa
- ED
- flats
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

