Bangladesh PM | ఇండియాకు రానున్న బంగ్లాదేశ్ ప్రధాని.. వచ్చే వారంలోనే పర్యటన
Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ఇండియాకు రానున్నారు. ఆయన వచ్చే వారం ఇండియాలో పర్యటిస్తారు. ఆగష్టు 20-25 తేదీల మధ్య ఇండియాలో పర్యటిస్తారు. వీటిలో కచ్చితమైన తేదీల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ఇండియాకు రానున్నారు. ఈ నెలలోనే ఆయన ఇండియాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది. మీడియా కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారం ఇండియాలో పర్యటిస్తారు. ఆయన ఆగష్టు 20-25 తేదీల మధ్య ఇండియాలో పర్యటిస్తారు. వీటిలో కచ్చితమైన తేదీల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
ఆగష్టు 20, 21 తేదీల్లో లేదా ఆగష్టు 21, 22 తేదీల్లో ఆయన పర్యటన ఉండొచ్చు. ఈ పర్యటనలో రహమాన్.. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై దాడి విషయంలో ఆ దేశంపై ఇండియా ఆగ్రహంగా ఉంది. ఇదే సమయంలో తమ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లా వ్యతిరేకతతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగు కోసం బంగ్లా ప్రధాని పర్యటన కీలక కానుంది. ఆయన పర్యటన సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.
ప్రధానంగా షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించే అంశంపై రహమాన్ చర్చించే అవకాశం ఉంది. అయితే, పర్యటన షెడ్యూల్, ముఖ్యాంశాలు వంటివి ఇంకా ఖరారు కాలేదు. ఇక.. రహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాలో పర్యటించనుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా ఇటీవలే బంగ్లా.. భారత్‌ను కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

