New Delhi | 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. రెండు రోజుల తర్వాత బయటపడ్డ మృతదేహం
New Delhi : దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రేపిస్టులు ఆ బాలికను చంపేశారు. తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.
New Delhi : దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రేపిస్టులు ఆ బాలికను చంపేశారు. తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ ఘటన ఢిల్లీలోని స్వరూప్ నగర్లో గతవారం జరిగింది. గత ఆదివారం కుషాక్ రోడ్డు వద్ద కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహం బయటపడటంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలివి.
స్వరూప్ నగర్ ప్రాంతంలో గత శుక్రవారం రాత్రి 16 ఏళ్ల బాలిక తన స్నేహితుడైన 17 ఏళ్ల యువకుడిని కలవడానికి వెళ్లింది. అతడి వద్దకు వెళ్లిన తర్వాత మరో ముగ్గురితో కలిసి ఆ బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం బాలికపై నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేసి, తర్వాత హత్య చేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని కుషాక్ రోడ్డుపై ఒక ఖాళీ ప్రదేశంలో పడేశారు. రెండు రోజుల తర్వాత.. అంటే ఆదివారం ఆ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
వారు వచ్చి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే బాలిక మృతదేహాన్ని కొన్ని కుక్కలు, ఇతర జీవులు పీక్కుతిన్నాయి. ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. శరీరం కూడా చాలావరకు కుళ్లిపోయింది. దీంతో అప్పుడు బాలిక ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. బాలిక ఒంటిపై అనేక గాయాలున్నట్లు వ్యైద్యులు తెలిపారు. దీంతో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కోణంలో పోలీసులు విచారణ జరిపారు.
ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు. చివరకు నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకడి వయసు 19 ఏళ్లు కాగా.. మరో ముగ్గురు మైనర్లు. అందులో ఒకడు బాలిక స్నేహితుడైన 17 ఏళ్ల యువకుడు. ఈ నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, అత్యాచారం, హత్య, పోక్సో వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

