Cotton price | పత్తి ధర తగ్గింపుపై రైతుల ఆందోళన.. రోజుకో ధరతో దోపిడీ చేస్తున్నారంటూ ఆగ్రహం
పత్తి ధర తగ్గింపుపై రైతులు భగ్గుమన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ ఎదుట శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
ఊట్కూర్, సెప్టెంబరు 18 : పత్తి ధర తగ్గింపుపై రైతులు భగ్గుమన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ ఎదుట శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పత్తి వాహనాలతో తెల్లవారేసరికి ఇండస్ట్రీ వద్దకు చేరుకున్నారు. గురువారం క్వింటాలుకు గరిష్ఠంగా రూ.9,500 ధర పలకగా.. శుక్రవారం రూ.200 తగ్గించి రూ.9,400కు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొందరికి రూ.9,350 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో ధర నిర్ణయిస్తూ తమను నష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.
దిగుబడి దారుణం.. ధరా దిక్కులేదు
వర్షాభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా పడిపోయిందని రైతులు వాపోయారు. చెట్టుకు రెండు, మూడు కాయలు మాత్రమే కాసిన పరిస్థితి ఉందన్నారు. ఎకరాకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించకుండా రోజుకో ధర నిర్ణయించడం రైతులను మరింత అప్పుల్లోకి నెడుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
ప్రభుత్వమే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పత్తి ధరల విషయంలోనూ పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శించారు. పంట దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అన్నారు. రైతుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రరూపం దాల్చితే ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రోడ్డుపై రాకపోకలకు అంతరాయం
రైతులు ఆందోళనకు దిగడంతో నారాయణపేట వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఉట్కూర్ ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం మిల్లు యజమానులతో చర్చించారు. మార్కెట్లోని ఆన్లైన్ ధరలను మిల్లు యజమానులు రైతులకు వివరించారు. ధరలపై చర్చించిన అనంతరం పోలీసులు, మిల్లు యజమానులు రైతులను సముదాయించారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఆందోళన అనంతరం రైతులు ధర్నాను విరమించారు. పత్తికి న్యాయమైన ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

