KTR | న్యాయస్థానాలపై నమ్మకం ఉంది.. భవిష్యత్తులో ఎప్పుడు పిలిచినా మళ్లీ వస్తా.: కేటీఆర్
KTR | ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి పేరు తీసుకురావాలని ప్రయత్నించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
KTR | ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి పేరు తీసుకురావాలని ప్రయత్నించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసులో ఏదో జరిగిపోయిందంటూ రేసును రద్దు చేసి తనపై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ కేసును న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా శుక్రవారం నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి పేరు తెచ్చే ఒక మంచి కార్యక్రమం ఫార్ములా ఈ రేస్‌ని హైదరాబాద్‌కి తెస్తే అందులో ఏదో జరిగిపోయిందంటూ ఆ రేస్‌ను క్యాన్సిల్ చేసి నా మీద కేసు పెట్టారు. అని అన్నారు.
నిన్న కాక మొన్న మీరు చూశారు. తమిళనాడు సీఎం విజయ్ ఒక మోటార్ రేసింగ్ ఈవెంట్‌కి లండన్ దాకా పోయారని కేటీఆర్ గుర్తుచేశారు. అది మోటార్ రేసింగ్ స్పోర్ట్కి కానీ, దాని వల్ల వచ్చే ఇమేజ్ అని అన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులేమో లండన్ దాకా పోయి అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అదే ప్రయత్నం మేం చేసి, హైదరాబాద్‌కు, తెలంగాణకు మంచి పేరు, పెట్టబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినందుకు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఫర్వాలేదని.. తమకు న్యాయస్థానాల మీద అపారమైన విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. అందుకే ఇవాళ రెండోసారి కోర్టుకు హాజరయ్యానని తెలిపారు. భవిష్యత్తులో కూడా కోర్టు ఎప్పుడు పిలిచినా మళ్లీ వస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

