Upendra | ఉపేంద్ర బర్త్‌డే స్పెషల్.. ‘జాంబీ రెడ్డి 2’ నుంచి రియల్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్!
Upendra | కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ (ZombieReddy2 NXT LVL) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Upendra | కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ (ZombieReddy2 NXT LVL) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఉపేంద్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరలవుతోంది.
ప్రపంచాన్ని తలకిందులు చేసేందుకు రియల్ స్టార్ సిద్ధమవుతున్నారంటూ చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటివరకు వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త, వైవిధ్యమైన అవతార్‌లో ఉపేంద్ర కనిపించబోతున్నారని మేకర్స్ తెలిపారు. ఆయన పాత్రలో కనిపించే మ్యాడ్నెస్, మరియు మాస్ కలగలిసిన సరికొత్త ఫ్లేవర్ ప్రేక్షకులను ఖచ్చితంగా షాక్‌కు గురిచేసేలా ఉంటుందని యూనిట్ పేర్కొంది.
సూపర్‌హీరో తేజ సజ్జాతో కలిసి ఉపేంద్ర స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కానుంది. వీరిద్దరి కలయికలో వచ్చే మాస్ రచ్చ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్ర నెలకొంది. మొత్తానికి ‘జాంబీ రెడ్డి 2’ తో రాబోతున్న ఈ నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Wishing the Real Star @nimmaupendra a very Happy Birthday 💥#ZombieReddy2 NXT LVL will unleash a whole new flavour of madness, menace & mass with his never-before-seen avatar ❤️🔥🧟♂️
Superhero @tejasajja123 @Suparn @PrasanthVarma #ShanayaKapoor @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/pSPSdlozwY
— People Media Factory (@peoplemediafcy) September 18, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

