Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
IdupuKayitham | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, జానపద గీతాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham).
Idupu Kayitham | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, జానపద గీతాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ డ్రామాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, తాజాగా చిత్రబృందం మరో కొత్త పాటను విడుదల చేసింది.
డిసెంబరు 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్, శనివారం ‘ఉల్లిపూల సిరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి’ (Ullipoola Song) అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాట పక్కా తెలంగాణ కుటుంబ నేపథ్యం, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సాగుతూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటలోని సాహిత్యం, సంగీతంతో పాటు ప్రియదర్శి, నాగదుర్గల మధ్య కెమిస్ట్రీ సహజసిద్ధంగా ఉండి సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో శివజ్యోతి, సుజాత, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలంగాణ నేటివిటీతో కూడిన భావోద్వేగభరితమైన కథాంశంతో తెరకెక్కిన ‘ఇడుపు కాయితం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

