Salt | సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని వాడవచ్చా.. రెండింటికీ తేడాలేమిటి..?
ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణం (సెందా నమక్) వాడుతున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు, విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగానికి మంచిదనే భావన చాలామందిలో ఉంది.
Salt | ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణం (సెందా నమక్) వాడుతున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు, విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగానికి మంచిదనే భావన చాలామందిలో ఉంది. అయితే తెల్ల ఉప్పు స్థానంలో సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల గుండె వేగం తప్పనిసరిగా తగ్గుతుందా అనే విషయంలో నిపుణులు కీలక విషయాలను చెబుతున్నారు. రెండు రకాల ఉప్పుల్లో ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడే. సాధారణ తెల్ల ఉప్పులో దాదాపు 97 నుంచి 99 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీనికి అయోడిన్‌ను కలపడం ద్వారా థైరాయిడ్ సమస్యలు, అయోడిన్ లోపాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది.
ఖనిజాలు అధికం..
సైంధవ లవణం మాత్రం సహజసిద్ధమైన రూపంలో లభిస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు స్వల్పంగా ఉంటాయి. అయితే ఈ ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉండడంతో వాటిని చికిత్సా ప్రయోజనాలకు సరిపడే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం. ఉప్పు ఏ రకమైనదైనా శరీరం దానిలోని సోడియంనే ప్రధానంగా పరిగణిస్తుంది. సోడియం అధికంగా తీసుకున్నప్పుడు శరీరంలో అదనపు నీరు నిల్వ అవుతుంది. దీంతో రక్త పరిమాణం పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలంలో ఇది అధిక రక్తపోటుకు, గుండెపై అదనపు భారానికి కారణమవుతుంది. కొంతమందిలో విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
సైంధవ లవణానికి మారితే..
అందువల్ల తెల్ల ఉప్పు నుంచి సైంధవ లవణానికి మారినంత మాత్రాన గుండె వేగం తగ్గదు. రోజువారీగా తీసుకునే మొత్తం సోడియం పరిమాణం తగ్గితేనే ప్రయోజనం ఉంటుంది. సైంధవ లవణం ఆరోగ్యకరమైనదనే నమ్మకంతో ఎక్కువగా ఉపయోగిస్తే, మొత్తం సోడియం తీసుకోవడం మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది రక్తపోటుతో పాటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం అయోడిన్. సాధారణ అయోడైజ్డ్ ఉప్పులో ఉండే అయోడిన్ సైంధవ లవణంలో సాధారణంగా ఉండదు. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అవసరం. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ పనితీరులో మార్పులు వచ్చి గుండె వేగంలో కూడా అసాధారణ మార్పులు వస్తాయి. అందువల్ల సాధారణ వంటల్లో అయోడైజ్డ్ ఉప్పును పూర్తిగా మానేయడం కంటే, అవసరాన్ని బట్టి సైంధవ లవణాన్ని పరిమితంగా ఉపయోగించడం మంచిది.
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉప్పు రకం మార్చడం కంటే రోజువారీ మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు మొత్తం ఉప్పు వినియోగం 5 గ్రాములకు మించకపోవడం మంచిది. ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, ప్రాసెస్ చేసిన మాంసాహారం, తక్షణం తయారయ్యే నూడుల్స్, సాస్‌లు, బేకరీ పదార్థాల్లో దాగి ఉన్న సోడియాన్ని కూడా తగ్గించాలి. అరటిపండ్లు, కొబ్బరి నీరు, పాలకూర, పప్పులు, చిలగడదుంప వంటి ఆహారాల ద్వారా పొటాషియం పొందడం ఉపయోగకరం. రోజూ నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, 7-8 గంటల నిద్ర కూడా విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. విశ్రాంతి సమయంలో గుండె వేగం నిరంతరం నిమిషానికి 100 కంటే ఎక్కువగా ఉండడం, గుండె దడ, తల తిరగడం, ఛాతీలో అసౌకర్యం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

