తిరుమల : ఆపదమొక్కుల వాడు, ఆపద్బాంధవుడు తిరుమల( Tirumala ) వేంకటేశ్వరస్వామికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం హైదరాబాద్కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సి.హెచ్.ఏ.పి.రామేశ్వరరావు, సాయిచందన ఏపిఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, రంగశ్రీ పాల్గొన్నారు.