టెహ్రాన్: అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై క్రూయిజ్ క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ భూభాగానికి సమీపిస్తే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నేవీ హెచ్చరించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. (USS Abraham Lincoln) యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకల సమూహాన్ని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్ నౌకాదళ కమాండర్ బుధవారం ఉదయం తెలిపారు. ఆ విమాన వాహక నౌక తమ క్షిపణి వ్యవస్థ పరిధిలోకి వచ్చిన మరుక్షణమే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఆ కమాండర్ హెచ్చరించారు.
కాగా, ఈ హెచ్చరిక నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక దిశగా తీరప్రాంత క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ సైనిక ప్రజా సంబంధాల విభాగం తెలిపింది. ‘ఇరాన్ నౌకాదళానికి చెందిన ఖాదర్ క్రూయిజ్ క్షిపణులు అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకున్నాయి. దాని స్థానాన్ని మార్చుకునేలా బలవంతం చేశాయి’ అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది. అయితే అమెరికా దీనిని ధృవీకరించలేదు.
🔴 موشکهای کروز ساحل به دریای ارتش، ناو هواپیمابر آبراهام لینکلن را هدف گرفت
🔹روابط عمومی ارتش از شلیک موشکهای کروز ساحل به دریا به سمت ناو هواپیمابر آبراهام لینکلن و هدف قراردادن این ناو خبر داد. pic.twitter.com/pCtmnNwFCE
— خبرگزاری فارس (@FarsNews_Agency) March 25, 2026
Also Read:
Iran vs Israel | ఇరాన్‌పై 15 వేలకుపైగా బాంబులు వేశాం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్
Strait Of Hormuz | హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్.. షరతులతో నౌకలను అనుమతి.. అయినా వాటికి నో
Pakistan Ship | అనుమతులు లేకుండా హర్మూజ్ జలసంధిని దాటే యత్నం.. పాక్ నౌకను వెనక్కి పంపిన ఇరాన్