Iran vs Israel | ఇరాన్‌పై 15 వేలకుపైగా బాంబులు వేశాం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్
Iran vs Israel | ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాల యుద్ధం ప్రారంభమై దాదాపు నెలరోజులు అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌పై 15 వేల బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
Iran vs Israel : ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాల యుద్ధం ప్రారంభమై దాదాపు నెలరోజులు అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌పై 15 వేల బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ (Katze) ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ సైన్యం 15 వేల బాంబులను ఇరాన్‌పై ప్రయోగించిందని కాట్జ్ చెప్పారు. గత ఏడాది జూన్‌లో 12 రోజులపాటు జరిగిన సంఘర్షణ సమయంలో కంటే నాలుగు రెట్లు బాంబులు ఉపయోగించినట్లు తెలిపారు. ఇరాన్‌లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు చెప్పారు.
ఇరాన్‌పై దాడిని ఐదు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

