Pakistan Ship | అనుమతులు లేకుండా హర్మూజ్ జలసంధిని దాటే యత్నం.. పాక్ నౌకను వెనక్కి పంపిన ఇరాన్
Pakistan Ship | ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటేందుకు యత్నించిన పాకిస్థాన్ నౌక (Pakistan Ship) ను ఇరాన్ (Iran) వెనక్కి పంపించింది. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాక్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ వెనక్కి పంపింది.
Pakistan Ship : ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటేందుకు యత్నించిన పాకిస్థాన్ నౌక (Pakistan Ship) ను ఇరాన్ (Iran) వెనక్కి పంపించింది. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాక్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ వెనక్కి పంపింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి చేసింది.
ఈ క్రమంలో హర్మూజ్ మీదుగా పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ కరాచీకి వెళ్తోంది. అయితే అనుమతులు లేకుండా వెళ్తున్న ఆ నౌకను వెనక్కి రప్పించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (IRGC) వెల్లడించింది. హర్మూజ్ గుండా వెళ్లే ప్రతి నౌక ఐఆర్జీసీ సముద్ర అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.
పాకిస్థాన్‌కు చెందిన నౌకను ఇరాన్ వెనక్కి రప్పించినట్లు కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా నుంచి ఈ నౌక కరాచీకి వెళ్తుండగా ఇరాన్ అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ జలసంధి గుండా తాము అనుమతించిన నౌకలు వెళ్లాలని చెబుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

