Kareena Kapoor Khan | బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన 56వ పుట్టినరోజును ఆగస్ట్ 16న గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక రోజున ఆయన సతీమణి, ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అందించిన శుభాకాంక్షలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సైఫ్, కరీనాలతో పాటు వారి కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి విదేశాల్లో సరదాగా గడిపిన కొన్ని అరుదైన, క్యాండిడ్ ఫ్యామిలీ హాలిడే ఫోటోలను కరీనా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ… నా ఫరెవర్ రైడ్ ఆర్ డైకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు లేకపోతే జీవితం ఎంత బోరింగ్‌గా ఉండేది! ఇక్కడ నేను పోస్ట్ చేసిన ఈ ఫోటోలన్నీ ఆయన స్వయంగా అప్రూవ్ చేసినవే. నా సోషల్ మీడియాలో తన ఫోటోలు పోస్ట్ చేస్తుంటే ఆయనకు చాలా ఇష్టం అంటూ ఒక సరదా నోట్ కూడా జోడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
View this post on Instagram