Kancharla Bhupal reddy | నల్లగొండలో రాక్షస రాజ్యం.. కమీషన్ల రాజ్యం నడుస్తుంది : కంచర్ల భూపాల్ రెడ్డి
Kancharla bhupal reddy | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ టవర్ నిర్లక్ష్యం, నల్గొండ యన్జీ కాలేజ్ నిర్మాణం ఆలస్యం చేశారని మాజీ బీఆర్ఎస్ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.
Kancharla Bhupal reddy | నల్లగొండలో రాక్షస రాజ్యం నడుస్తుంది… కమీషన్ల రాజ్యం నడుస్తుందని మాజీ బీఆర్ఎస్ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.మంత్రి కోమటి రెడ్డి అండతోనే. అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో బీఆర్ఎస్ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎం ఆఫీస్ మీద పోలీసుల దౌర్జన్యంపై తీవ్రంగా ఖండించారు.
మరో రెండు సంవత్సరాలలో నల్గొండలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక్కో ఇల్లుకు రూ.3 లక్షల వరకు లంచాలు పుచ్చుకున్నారు. 546 డబులు బెడ్ రూమ్ ల ఇండ్ల నిర్మాణం కేసీఆర్ నాయకత్వంలో చేశాం. స్థానిక డివిజన్లో ప్రజల సమక్షంలో డ్రా తీశాం. డ్రాలో పేరు వచ్చిన వారికి మాత్రమే ఉంచాం.431 ఇళ్లకు నాడు డ్రా తీశాం. డీఈవో కార్యాలయం దుప్పల పల్లి నుండి రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి హామీ ఇచ్చాం.నాటి కలెక్టర్ ఆధ్వర్యంలో 130 రోడ్డు బాధితులకు సెలక్ట్ చేశాం. నాడు డ్రాలో వచ్చిన వారిలో 150 మందికి కూడా ఇవ్వలేదు.ప్రజల నుండీ వచ్చిన, వినతి పత్రాలను కలెక్టర్ పట్టించుకోలేదు.సీపీఎం నాయకుల కార్యాలయంపై పోలీసుల దాడి అమానుషం సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి. త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తాళాలు వేస్తాం. ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్రజాస్వామికంమళ్లీ డ్రా తీసి అర్హులకు ఇండ్లు ఇవ్వాల్సిందే.లేకుంటే మా ప్రభుత్వం వచ్చాక అన్ని రద్దు చేసి మళ్లీ డ్రా తీస్తాం.డబ్బులు ఇచ్చినవారు వెంటనే వసూలు చేసుకోండి లేకుంటే తర్వాత నష్టపోతారని సూచించారు.పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుర్రు.అమృత్ స్క్రిం కింద నిధులు దుర్వినియోగం.వెంచర్లలో అమృత్ స్కీం సీసీ రోడ్లు వేస్తుర్రు.లతీఫ్ సాబ్ గుట్టకు బఫర్ జోన్ తీయలేదు.రానున్న రోజుల్లో వెంచర్లపై విజిలెన్స్ వేస్తామన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి.
బీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశాం. పట్టణంలో పార్కులు శిథిలావస్థకు చేరాయి. 2040 విజన్లో నల్లగొండను అభివృద్ధి చేయండి. ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ టవర్ నిర్లక్ష్యం, నల్గొండ యన్జీ కాలేజ్ నిర్మాణం ఆలస్యం చేశారని కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.
Read Also :
National Song | వందేమాతరంపై రాజకీయ వివాదం.. మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్
NRI | దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఏఎస్ఏ
Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్పై కార్తీక్ దండు కీలక అప్డేట్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

