Nani | నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ ర్యాంపేజ్.. విడుదలకు ముందే దూసుకెళ్తున్న నాని సినిమా!
Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ సినిమాతో తనదైన మాస్ మేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి నాని మరింత భిన్నమైన పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ సినిమాతో తనదైన మాస్ మేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి నాని మరింత భిన్నమైన పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు మరికొద్ది గంటలే సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ మార్కెట్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు వస్తున్న స్పందన ఇప్పుడు చిత్రబృందంలో ఉత్సాహాన్ని పెంచుతోంది.
‘ది ప్యారడైజ్’ నార్త్ అమెరికా మార్కెట్లో ఇప్పటికే 7.5 లక్షల డాలర్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో సినిమా విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నాని గత చిత్రాలతో పోలిస్తే ‘ది ప్యారడైజ్’కు ఓవర్సీస్లో భారీ స్థాయిలో హైప్ కనిపిస్తుండటం విశేషంగా మారింది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల–నాని కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్, సినిమా కథాంశంపై ఏర్పడిన ఆసక్తి ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌కు కారణంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాని పోషిస్తున్న పాత్ర పేరు ‘జడల్ గాని’. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌లో నాని లుక్, పాత్ర తీరుతెన్నులు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలను మేళవించి సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. అందుకే ‘ది ప్యారడైజ్’ కేవలం యాక్షన్ సినిమాగా కాకుండా భావోద్వేగాలతో కూడిన కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బలమైన నటీనటుల బృందం ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. మరోవైపు ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, నేపథ్య సంగీతంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. విడుదలకు ముందే నార్త్ అమెరికాలో 7.5 లక్షల డాలర్ల మార్క్‌ను దాటిన ‘ది ప్యారడైజ్’.. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి 1 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

