NRI | దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఏఎస్ఏ
NRI | దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) పాల్గొంది.
NRI | దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) పాల్గొంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ అధికారులు, ప్రముఖులు, ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TASA ప్రతినిధులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు మరియు భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా తమ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో TASA బృందం పాల్గొని, దేశభక్తికి సంబంధించిన నృత్యాలతో ఎంతగానో అలరించారు.
కాన్సులేట్ జనరల్ ఎస్ కోవెంతన్ మాట్లాడుతూ..80 వసంతాల స్వాతంత్య్రం ఎంతో మంది త్యాగమూర్తుల కృషి ఫలితం అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు భారతదేశం ఎంతో ముందుకు వెళ్లిందని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తుందని అన్నారు. ప్రతి ప్రవాస భారతీయుడు కొత్త సాంకేతికత దిశగా ముమ్మర ప్రయత్నం చేసి, నూతన ఆవిష్కరణలను చెయ్యాలని, భారతదేశం గర్వపడేలా చెయ్యాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, TASA బృందం కాన్సులేట్ ఆఫీసు చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ముందుండి నడిపిస్తారని, కాన్సులేట్ జనరల్ గారు TASA బృందాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. TASA అధ్యక్షుడు మురళి బండారు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. భారతదేశ ఐక్యత, వైవిధ్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రవాస భారతీయులందరూ కలిసి పనిచేయాలని అన్నారు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

