Dragon | జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’పై కీలక అప్డేట్.. అక్టోబర్ నుంచి మారథాన్ షెడ్యూల్!
Dragon | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ సమయంలో భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Dragon | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ సమయంలో భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తిరిగి షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటారనే దానిపై తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారం నుంచి ‘డ్రాగన్’ తదుపరి షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉంది. గాయం కారణంగా ఎన్టీఆర్ కొంతకాలం షూటింగ్‌కు దూరమైనప్పటికీ.. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం చిత్రీకరణను ఆపకుండా ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలతో పాటు ఇతర నటీనటులు పాల్గొనే కీలక సన్నివేశాలను ఈ విరామ సమయంలోనే చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు చిత్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ‘డ్రాగన్’ షూటింగ్‌తో పాటు ఈ సుదీర్ఘ షెడ్యూల్లోనే భవిష్యత్ సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఉండే భారీ యాక్షన్, డార్క్ షేడ్స్‌తో ‘డ్రాగన్’ కూడా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారం, దాని వెనుక జరిగే ఆధిపత్య పోరాటం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంతకుముందెన్నడూ కనిపించని విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ‘లూగర్’ అనే క్రూరమైన పాత్రలో ఎన్టీఆర్‌ను పరిచయం చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

