Drought Mandal | తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిపై నిరసన
Drought Mandal | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై ఆందోళన చేపట్టారు.
తలమడుగు : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని ( Talamadugu Mandal ) కరువు ( Drought ) మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల రైతులు అంతర్రాష్ట్ర రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర రహదారిపై బైఠాయించి నాలుగు గంటల పాటు నిరసన ( Protest ) తెలిపారు. జిల్లాలోని 20 మండలాలను కరువు మండ లాలుగా ప్రకటించిన ప్రభుత్వం తలమడుగు మండలాన్ని పక్కన పెట్టిందని వాపోయారు.
వర్షాలు లేక రైతులు పంటలు నష్టపోయాయని అధికారులు మండలంలో ఎక్కువ వర్షపాతం ఉందంటూ నివేదికను ఇవ్వడం సరికాదని తెలిపారు. అధికారుల నివేదికల ఆధారంగా తలమడుగు మండలానికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం స్పందించి వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన వద్దకు చేరుకున్న ఆర్డీవో జగదీశ్వర్ రావు కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drought Mandal | తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిపై నిరసన
Medical Expenses | భారత్‌లో భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చుల వ్యయం.. ఒక్క ఏడాదిలోనే రూ.4.06 లక్షల కోట్ల ఖర్చు..
తెలంగాణ భవన్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు
కేటీఆర్‌ను కలిసిన రవీంద్రకుమార్
PM Modi | నేపాల్‌లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

