తెలంగాణ భవన్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని...
– ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నల్లగొండ, నవంబర్ 23 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని కేక్ కట్ రమావత్ రవీంద్ర కుమార్ కి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రమావత్ రవీంద్ర కుమార్ అందిస్తున్న సేవలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను అభినందించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పల్లా ప్రవీణ్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జి.వెంకటనారాయణగౌడ్, నేవూరి దర్మేందర్ రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, బొడ్డు గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొని రవీంద్ర కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Expenses | భారత్‌లో భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చుల వ్యయం.. ఒక్క ఏడాదిలోనే రూ.4.06 లక్షల కోట్ల ఖర్చు..
తెలంగాణ భవన్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు
కేటీఆర్‌ను కలిసిన రవీంద్రకుమార్
PM Modi | నేపాల్‌లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

