Motkupalli Narsimhulu | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే దళితుల పట్ల చులకన భావం : కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
Motkupalli Narsimhulu | చులకన భావంతో దళితులను చూసిన సందర్భం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే కనబడుతుంది..ఇది చాలా దురదృష్టకరం.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు.
Motkupalli Narsimhulu | సీఎం రేవంత్ రెడ్డి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన.. తెలుగు దేశం ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు కూడా చూసి.. మొన్న బీఆర్ ఎస్ గవర్నమెంట్‌ను కూడా చూశా.. ఏదేమైనా ఇంత లెక్కలేని తనం, చులకన భావంతో దళితులను చూసిన సందర్భం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే కనబడుతుంది..ఇది చాలా దురదృష్టకరం.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
అసలు ఏదైనా సంఘటన జరిగితే దానిమీద రివ్యూ చేసేది లేదు.. మాట్లాడేది లేదు.. దానికి సంబంధించిన నాయకులను పిలిచేది లేదు.. ఎవరినీ ఖాతరు చేయకుండా మాకిష్టమొచ్చినట్టు మేం బతుకుతమన్నట్టుగా ఈ సర్కార్ ముందుకు పోతున్నది.. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అయ్యా.. నాయనా, రేవంత్‌రెడ్డి కేవలం ఈ నెలలో చూద్దాం.. గత మూడేళ్లది చూస్తే చాలా ఉంది.. ఈ నెల, రెండు నెలల్లో చూస్తే.. మొన్న పెద్దపల్లిలో అక్షితారాణి.. కష్టపడి బీటెక్ చదువుకున్న పేద అమ్మాయిని లైంగిక దాడి చేసి చంపారు.. నేరస్థులకు ఏం శిక్ష వేస్తరో ఏం జరుగుతుందో ఎవరు చెప్పిన దాఖలాలు లేవు.. ముఖ్యమంత్రి అసలేం మాట్లాడటం లేదు.. అంటరానివాళ్ల గురించి నా నోటి నుంచి మాట్లాడను అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఉన్నడు.. ఇది చాలా దురదృష్టకరం.. బాధాకరం.. అక్కడి నుంచి వస్తే చింతపల్లిలో ఈ అమ్మాయిని ‘మాదిగ ల..’ అని వాడు కొట్టాడు.. కొట్టిన దాని మీద ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నదని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.
నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో దళితులను ఇంత చిన్నచూపు చూసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు
దళిత యువతులపై దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదు
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పలేదు, కనీసం ఇలాంటి ఘటనలపై రివ్యూ మీటింగులు కూడా లేవు
– కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Also :
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motkupalli Narsimhulu | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే దళితుల పట్ల చులకన భావం : కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
Drought Mandal | తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిపై నిరసన
Medical Expenses | భారత్‌లో భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చుల వ్యయం.. ఒక్క ఏడాదిలోనే రూ.4.06 లక్షల కోట్ల ఖర్చు..
తెలంగాణ భవన్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు
కేటీఆర్‌ను కలిసిన రవీంద్రకుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

