Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
Ayodhya-Janaki Dham train | భారత్, నేపాల్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కీలక చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో సోమవారం భారత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షా కలిసి జెండా ఊపి అయోధ్య-జానకీ ధామ్ రైలును ప్రారంభించారు.
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కీలక చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో సోమవారం భారత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షా కలిసి జెండా ఊపి అయోధ్య-జానకీ ధామ్ రైలును ప్రారంభించారు. రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దు అనుసంధానాన్ని, మతపరమైన పర్యాటకాన్ని ఇది బలోపేతం చేస్తుందని వారు ఆకాంక్షించారు. (Ayodhya-Janaki Dham train) నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలిసారి భారత్ పర్యటన కోసం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ధామ్‌ను నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్తో కలిపే ‘సరయూ కమలా ఎక్స్‌ప్రెస్’ అనే కొత్త రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు.
కాగా, వారంలో ఒకసారి నడిచే ఈ రైలు ఉత్తర ప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని ముఖ్య గమ్యస్థానాలను కలుపుతుంది. గోరఖ్‌పూర్, బస్తీ, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్ స్టేషన్లలో ఇది ఆగుతుంది. శ్రీరాముడు, జానకి దేవితో సంబంధం ఉన్న ఈ రెండు పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల ప్రయాణాన్ని ఇది మరింత సౌకర్యవంతం చేస్తుంది.
మరోవైపు అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతరులు పాల్గొన్నారు. అయోధ్య, జనక్‌పూర్‌ల మధ్య ఉన్న ప్రాచీన మత, సాంస్కృతిక సంబంధాలను ఈ రైలు పునరుద్ధరిస్తుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
#WATCH | Delhi | PM Narendra Modi and Nepali PM Balendra Shah jointly flag off the Saryu-Kamala Express, a new weekly train service between Ayodhya Cantt in Uttar Pradesh and Janakpur Dham in Nepal
(Video source: DD) https://t.co/dmbEtEBr9i
— ANI (@ANI) November 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
Farmer | ఆర్డీవో, డీఎస్పీ కాళ్లపై పడ్డ రైతు లస్మన్న.. వీడియో
KRMB | కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ తొండాట.. మరో 10 టీఎంసీలు కావాలని పట్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

