Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
Asia Power Index | భారతదేశం ఆసియా పవర్ ఇండెక్స్-2026 (Asia Power Index-2026) లో ప్రధాన శక్తి హోదాకు చేరుకుందని ఆస్ట్రేలియా (Australia) కు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. భారత్ ఆసియా ఖండంలోనే మూడో శక్తిమంతమైన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని వెల్లడించింది.
Asia Power Index : భారతదేశం ఆసియా పవర్ ఇండెక్స్-2026 (Asia Power Index-2026) లో ప్రధాన శక్తి హోదాకు చేరుకుందని ఆస్ట్రేలియా (Australia) కు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. భారత్ ఆసియా ఖండంలోనే మూడో శక్తిమంతమైన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని వెల్లడించింది. అదేవిధంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండో అతి శక్తిమంతమైన నేతగా రికార్డుల్లో నిలిచారు.
పెరిగిన ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం, ఆగ్నేయాసియాకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకాలు భారత దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేశాయని ఆసియా పవర్ ఇండెక్స్ నివేదిక పేర్కొన్నది. అదేసమయంలో స్థిరమైన వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు దేశాన్ని మరింత ముందుకు నడిపాయని తెలిపింది. ఆసియాలోని దేశాల శక్తి సామర్థ్యాలు, అవి చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్ (Asia Power Index) ను నిర్ణయిస్తారు.
ఆసియా పవర్ ఇండెక్స్-2025లో 40 పాయింట్ల స్కోరుతో ఉన్న భారత్.. ఈ ఏడాదిలో 0.5 పాయింట్లు మెరుగుపడి 40.5 పాయింట్లకు చేరింది. దాంతో 2018 తర్వాత చైనాతో అంతరం భారీగా తగ్గింది. మొత్తం 100 పాయింట్లకుగానూ అమెరికా 78.9, చైనా 73.6 స్కోరుతో 2026 నాటికి ఆసియాలో అగ్రరాజ్యాలుగా నిలిచాయి. ఇక ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తర్వాత రెండో అత్యంత సమర్థమైన నాయకుడిగా నిలిచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
Farmer | ఆర్డీవో, డీఎస్పీ కాళ్లపై పడ్డ రైతు లస్మన్న.. వీడియో
KRMB | కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ తొండాట.. మరో 10 టీఎంసీలు కావాలని పట్టు
తీర్మానం లేకుండానే వీవో భవనాల నిర్మాణం!
Scholorships | ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వరం.. దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 30
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

