Scholorships | ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వరం.. దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 30
ప్రతిభావంతులై, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ (ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఫౌండేషన్ స్కాలర్షిప్స్ అందిస్తుంది.
వివరాలు
మొత్తం స్కాలర్షిప్స్- 2000
కేటగిరీల వారీగా..
1. ఎస్సీ, ఎస్టీ – 1000
2. ఓబీసీ- 500
3. జనరల్- 500
అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను మహిళలకు కేటాయించారు.
కోర్సుల వారీగా..
ఇంజినీరింగ్
ఎస్సీ, ఎస్టీలకు 500, ఓబీసీలకు 300, జనరల్‌కు 300
ఎంబీబీఎస్
ఎస్సీ, ఎస్టీలకు 90, ఓబీసీలకు 50, జనరల్‌కు- 50
ఎంబీఏ
ఎస్సీ, ఎస్టీలకు 140, ఓబీసీలకు 50, జనరల్‌కు 50
ఎమ్మెస్సీ
ఎస్సీ, ఎస్టీలకు 270, ఓబీసీలకు 100, జనరల్‌కు 100
అర్హతలు
ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైం, రెగ్యులర్ విధానంలో డిగ్రీ అంటే బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ ఏదో ఒక కోర్సులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్లో తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీ చేసేవారైతే డిగ్రీ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 లక్షలు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.

Ongc Scholorship
వయస్సు
2026, ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లు మించరాదు.
ఎంపిక
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదివేవారికి ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా, పీజీ చేసేవారికి డిగ్రీ మార్కుల ఆధారంగా స్కాలర్షిప్స్ కేటాయిస్తారు.
అభ్యర్థులు వేరే ఏ స్కాలర్షిప్స్ తీసుకోనివారై ఉండాలి. ఎంపికైన వారి జాబితాను ఓఎన్జీసీ వెబ్సైట్లో ఉంచుతారు.
స్కాలర్షిప్స్ కొనసాగాలంటే కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఏటా నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ అప్లికేషన్‌ను రెన్యువల్ చేసుకోవాలి.
ఎంత ఇస్తారు
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేండ్లు, ఎంబీఏ, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి రెండేండ్ల పాటు నెలకు రూ. 4000 చొప్పున చెల్లిస్తారు.
చివరితేదీ
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరితేదీ నవంబర్ 30. వివరాలకు వెబ్సైట్ https://ongcscholar.org/#/fellowshipScheme చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scholorships | ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వరం.. దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 30
రూ.30 వేల అప్పు వివాదంలో హత్య.. వ్యక్తికి జీవిత ఖైదు
Army Soldiers Killed | ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. ట్యాంకు కింద నలిగి ఇద్దరు సైనికులు మృతి
Om | తొలి వీకెండ్లోనే రూ.101 కోట్లు..బాక్సాఫీస్ వద్ద ధనుష్ ‘ఓం’ సంచలనం!
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల సంపద 5.33 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

