Army Soldiers Killed | ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. ట్యాంకు కింద నలిగి ఇద్దరు సైనికులు మృతి
Army Soldiers Killed | సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి జరిగింది. ట్యాంకు ఢీకొట్టడంతో దాని కింద నలిగి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ సంఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చండీగఢ్: సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి జరిగింది. ట్యాంకు ఢీకొట్టడంతో దాని కింద నలిగి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ సంఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Army Soldiers Killed) శనివారం సైనిక శిక్షణలో భాగంగా సుమారు 32 ట్యాంకులతో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ధూళి గాలిలోకి లేచింది.
కాగా, భారీ ధూళి కారణంగా ఒక ట్యాంకు డ్రైవర్‌కు ముందున్న మార్గం సరిగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ముందు ఉన్న ఇద్దరు సైనికులపైకి ఆ ట్యాంక్ దూసుకెళ్లింది. జవాన్ల పైనుంచి ఆ ట్యాంకు వెళ్లడంతో దాని కింది నలిగిన వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హిసార్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మరోవైపు మరణించిన ఇద్దరు సైనికులను ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీకి చెందిన నాయక్ మనీష్ కుమార్, బదాయూన్‌కు చెందిన నాయక్ అంకుశ్ కుమార్‌గా గుర్తించారు. ఆర్మీ అధికారులతో పాటు హిసార్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.30 వేల అప్పు వివాదంలో హత్య.. వ్యక్తికి జీవిత ఖైదు
Army Soldiers Killed | ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. ట్యాంకు కింద నలిగి ఇద్దరు సైనికులు మృతి
Om | తొలి వీకెండ్లోనే రూ.101 కోట్లు..బాక్సాఫీస్ వద్ద ధనుష్ ‘ఓం’ సంచలనం!
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల సంపద 5.33 లక్షల కోట్లు ఆవిరి..!
Malabar Tree Toad | అరుదైన జీవి మలబార్ ట్రీ టోడ్.. పశ్చిమ కనుమలకే ప్రత్యేకమైన ఉభయచరం!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

