Malabar Tree Toad | అరుదైన జీవి మలబార్ ట్రీ టోడ్.. పశ్చిమ కనుమలకే ప్రత్యేకమైన ఉభయచరం!
పశ్చిమ కనుమలు జీవవైవిధ్యానికి నిలయంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కనిపించే అనేక అరుదైన జీవుల్లో మలబార్ ట్రీ టోడ్ ఒకటి. సాధారణంగా టోడ్స్ భూమిపై నివసిస్తుండగా, ఈ జాతి చెట్లపైకి ఎక్కి జీవించే ప్రత్యేకతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా కనిపించకుండా పోయి, తిరిగి గుర్తించిన ఈ ఉభయచరం శాస్త్రవేత్తల అధ్యయనం గురించి విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అందిస్తున్నాం.
Malabar Tree Toad | దీని శాస్త్రీయ నామం Pedostibes tuberculosus, Bufonidae కుటుంబం, Anura క్రమం, Pedostibes జాతికి చెందింది. ఇది Pedostibes అనే మోనోటైపిక్ జెనస్లో ప్రస్తుతం గుర్తించిన ఏకైక జాతి. అంటే ఈ జెనస్లో ఈ ఒక్క జాతి మాత్రమే ఉంది.
బ్రిటిష్ జంతు శాస్త్రవేత్త ఆల్బర్ట్ గున్థర్ 1876లో ఈ జాతిని శాస్త్రీయంగా వివరించారు. అయితే ఆ తర్వాత వందేండ్లకు పైగా దీని ఉనికికి సంబంధించిన నిర్ధారిత రికార్డులు లభించలేదు. 1980లో ఎస్.కె. భట్టాచార్య కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో దీన్ని తిరిగి గుర్తించారు.
ఇది మలబార్ ట్రీ టోడ్ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు మాత్రమే స్థానికమైన (Endemic) జాతి. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో దీని ఉనికి నమోదైంది. పశ్చిమ కనుమల్లోని వివిధ ప్రాంతాల్లో దీని ఆవాసాలు విస్తరించి ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో దీని ఉనికి సమానంగా ఉండదు.
సముద్ర మట్టానికి సుమారు 50 మీటర్ల నుంచి 1,000 మీటర్లకు పైన ఎత్తులోని ప్రాంతాల్లో కనిపిస్తుంది. సతత హరిత, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు దీని ప్రధాన ఆవాసాలు. వాగులు, చెట్ల కొమ్మలు, చెట్ల తొర్రలు వంటి ప్రదేశాల్లో నివసిస్తుంది. భూమి నుంచి సుమారు 30 సెంటీమీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు చెట్లపై కనిపిస్తుంది.
లక్షణాలు
పశ్చిమ కనుమల్లోని చాలా టోడ్ జాతులు భూమిపై నివసిస్తాయి. అయితే మలబార్ ట్రీ టోడ్ చెట్లను ఎక్కి, వాటిపై నివసించగల ఆర్బోరియల్ (Arboreal వృక్షవాసి) జాతి. దీని వేళ్ల చివరల్లో ఉండే ప్రత్యేకమైన అంటుకునే డిస్కుల వంటి నిర్మాణాలు చెట్లపైకి ఎక్కడానికి సహాయపడతాయి.
వర్షాకాలంలో అడవుల్లోని వాగుల సమీపంలో మగ టోడ్స్ గుంపులుగా చేరి ప్రత్యేక శబ్దాలు చేస్తూ ఆడ టోడ్స్‌ను ఆకర్షిస్తాయి. ఇవి నీటితో సంబంధం ఉన్న ప్రదేశాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. నీరు నిలిచే వెదురు లేదా రెల్లుగడ్డి కాండాల లోపల కూడా వీటి టాడ్‌పోల్స్ అభివృద్ధి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు.

Malabar Tree Tod 1
2024 ఆగస్టులో Scientific Reports జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన మలబార్ ట్రీ టోడ్ భవిష్యత్తు ఆవాసాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని విశ్లేషించింది. ఈ పరిశోధనలో వార్షిక వర్షపాతం దీని భౌగోళిక వ్యాప్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన వాతావరణ అంశంగా గుర్తించారు.
అధిక గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల పరిస్థితుల్లో, 20612080 కాలానికి రక్షిత ప్రాంతాల్లో ఈ జాతికి అనుకూలమైన ఆవాస విస్తీర్ణం 33.5% నుంచి 68.7% వరకు తగ్గవచ్చని నమూనాలు అంచనా వేశాయి.
ముఖ్యంగా మధ్య పశ్చిమ కనుమల్లో అనుకూల ఆవాసాలు తగ్గి, దక్షిణ పశ్చిమ కనుమల వైపు మారే అవకాశం ఉందని పరిశోధన సూచించింది. 68.7% అనేది టోడ్ల జనాభా తగ్గుదల అంచనా కాదు. అధిక ఉద్గారాల పరిస్థితుల్లో రక్షిత ప్రాంతాల్లో అనుకూల ఆవాస విస్తీర్ణం తగ్గుదలకు సంబంధించిన మోడల్ అంచనా.
పరిరక్షణ
IUCN రెడ్ లిస్ట్ 2020 అంచనా ప్రకారం మలబార్ ట్రీ టోడ్ Least Concern (LC) కేటగిరీలో ఉంది. అయితే దీని జనాభా ధోరణి తగ్గుతున్నట్లు నమోదు చేశారు. ఆవాసాల నాణ్యత తగ్గడం, అడవుల విభజన, వాతావరణ మార్పులు వంటి అంశాలు దీర్ఘకాలంలో ఈ జాతి మనుగడకు సవాలుగా మారవచ్చు.
మలబార్ ట్రీ టోడ్ను గుర్తించడం, దాని వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో పౌర శాస్త్రం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. India Biodiversity Portalలోని Frog Watch కార్యక్రమంలో భాగంగా ‘Mapping Malabar Tree Toad’ అనే కార్యక్రమం ద్వారా ప్రజలు, ప్రకృతి పరిశీలకులు అందించిన సమాచారాన్ని పరిశోధకులు ఉపయోగించారు. 2024 పరిశోధనలో 600కు పైగా పరిశీలన రికార్డులను విశ్లేషణకు పరిగణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malabar Tree Toad | అరుదైన జీవి మలబార్ ట్రీ టోడ్.. పశ్చిమ కనుమలకే ప్రత్యేకమైన ఉభయచరం!
Professor Teja Sri | ‘వీసీ అల్డాస్ జానయ్య ఆ చైర్లో ఉండొద్దు’.. బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్ష
Suicide Attempt | ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు
Manchu Vishnu | మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా.. VM24 ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారుగా..!
రామాయంపేటలో ఆర్డీవో ఆఫీస్‌ను ప్రారంభించాలి : పద్మాదేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

