Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల సంపద 5.33 లక్షల కోట్లు ఆవిరి..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా నష్టాల్ల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు (Bank Shares), మెటల్ స్టాక్స్ (Metal Stocks) లో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. నిఫ్టీ 350 పాయింట్లపైగా నష్టాల్లో ట్రేడవుతున్నది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా నష్టాల్ల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు (Bank Shares), మెటల్ స్టాక్స్ (Metal Stocks) లో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. నిఫ్టీ 350 పాయింట్లపైగా నష్టాల్లో ట్రేడవుతున్నది. వరుసగా గత రెండు సెషన్లలో రాణించిన మార్కెట్లు ఇవాళ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం మార్కెట్ల పతనానికి కారణమైంది.
ఈ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సెన్సెక్స్ 1180 పాయింట్ల నష్టంతో 82,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,447.00 వద్ద కొనసాగుతున్నది. ఇంట్రాడేలో 84,662.96 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 82,893.33 వద్ద కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ ఈ నెలలో దాదాపు పది శాతం పెరిగింది. రెండు బెంచ్ మార్క్ సూచీలు జీవనకాల గరిష్ఠాలకు 2, 3 శాతం దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం మార్కెట్లను నష్టపర్చింది. విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా 15 సెషన్లలో కొనుగోళ్లకు దిగారు. ఈ నెలలో రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. అధిక వెయిటేజీతో కూడిన షేర్లు కుంగడం వల్ల కూడా సూచీలపై ఒత్తిడి పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీ బ్యాంక్ షేర్లు 2.5 శాతం మేర క్షీణించాయి.
డిసెంబర్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యూఎస్‌లో వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా ఆస్తులు ఆకర్షణీయంగా మారి, విదేశీ పెట్టుబడులు భారత్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల సంపద 5.33 లక్షల కోట్లు ఆవిరి..!
Malabar Tree Toad | అరుదైన జీవి మలబార్ ట్రీ టోడ్.. పశ్చిమ కనుమలకే ప్రత్యేకమైన ఉభయచరం!
Professor Teja Sri | ‘వీసీ అల్డాస్ జానయ్య ఆ చైర్లో ఉండొద్దు’.. బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్ష
Suicide Attempt | ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు
Manchu Vishnu | మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా.. VM24 ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారుగా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

