Farmer | ఆర్డీవో, డీఎస్పీ కాళ్లపై పడ్డ రైతు లస్మన్న.. వీడియో
Farmer | రైతన్నల పరిస్థితిని అద్దం పట్టే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల రైతులు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
Farmer | ఎల్నినో ప్రభావం, కరెంట్ కోతలు, సాగు నీరందక రాష్ట్రంలో రైతన్న పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపించే చాలా దృశ్యాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొనుగోలు కేంద్రాలు, రోడ్డెక్కి ధర్నా చేస్తున్న సందర్భంగా పలువురు రైతన్నలు అధికారులు, పోలీసుల కాళ్లపై వేడుకున్న ఘటనలు మీడియాలో కనిపించాయని తెలిసిందే.
తాజాగా రైతన్నల పరిస్థితిని అద్దం పట్టే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల రైతులు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్ వారి వద్దకు వచ్చారు.
అధికారయంత్రాంగం రైతులతో మాట్లాడే క్రమంలో సుంకిడి గ్రామానికి చెందిన రైతు లస్మన్న ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్ కాళ్లపై పడి తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి సారూ అని వేడుకున్నారు. ఈ వీడియో రైతన్న పరిస్థితి ఎలా ఉందో మరోసారి చెబుతోంది.
తెలంగాణలో అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకునే దుస్థితికి వచ్చిన రైతన్నలు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్ కాళ్లు పట్టుకొని వేడుకున్న సుంకిడి గ్రామానికి చెందిన రైతు లస్మన్న https://t.co/x0BtgOEaFf
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | నేపాల్లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

