AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
AP News | తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేత పట్ల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
అమరావతి : తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయ స్వామి ( Anjaneya Temple) ఆలయం కూల్చివేత పట్ల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ( Bhumana Karunakar Reddy ) నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై అడ్డంగా ఉందనే నేపంతో కూటమి ప్రభుత్వం అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నేలమట్టం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయన బైటాయించి నిరసన తెలిపారు. వేల సంవత్సరాల నాటి పురతాన ఆలయాన్ని తొలగించడం దారుణమని, అన్నారు. పల్లవరాజుల కాలం నాటి ఈ పురాత ఆలయంలో అగస్త్య మహాముని, అన్నమయ్య, కంచి చంద్రశేఖర్ స్వామిజీ తదితర ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారని గుర్తు చేశారు. అంతటి మహత్తర ఆలయాన్ని తొలగించారని మండిపడ్డారు.
జాతీయ రహదారి డిజైన్‌లో మార్పులు చేసే అవకాశమున్నా హిందూ సమాజంపై ఉన్న కక్షతో ఆలయాన్ని తొలగించారని ఆరోపించారు. సనాతన ధర్మ పరిరక్షణ గురించి గొప్పగా ఉపన్యాసాలిచ్చే ఏపీ డిప్యూటీ సీఎం ఆలయాల తొలగింపుపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
Farmer | ఆర్డీవో, డీఎస్పీ కాళ్లపై పడ్డ రైతు లస్మన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

