Bengaluru | పోక్సో కేసు నిందితుడు, స్కూల్ టీచర్ ఆత్మహత్య.. ఎస్పీ ఆఫీసు బిల్డింగ్‌పై నుంచి దూకి మృతి
Bengaluru : పోక్సో కేసులో నిందితుడిగా ఒక స్కూల్ టీచర్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ కార్యాలయం బిల్డింగ్ పై నుంచి దూకి మరణించాడు.
Bengaluru : పోక్సో కేసులో నిందితుడిగా ఒక స్కూల్ టీచర్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ కార్యాలయం బిల్డింగ్ పై నుంచి దూకి మరణించాడు. ఈ ఘటన రామనగర పరిధిలో ఆదివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. మృతుడు విజయనగర జిల్లాకు చెందిన శశిధర (49).. చన్నపట్న తాలూకాలోని ఒక ప్రైవేటు స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేవాడు.
అతడు పని చేసే స్కూల్లో కొందరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విద్యార్థినుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శశిధర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ముందుగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు అతడిని ఆదివారం బెంగళూర్ సౌత్ ఎస్పీ ఆఫీసు బిల్డింగ్ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో శశిధర్‌ను పోలీసులు పట్టుకుని ఉన్నారు.
అక్కడి అతడి ఫింగర్‌ప్రింట్స్ సేకరిస్తున్నారు. ఆ సమయంలో అతడు అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను తోసేసి, అక్కడినుంచి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. బిల్డింగ్ మూడో అంతస్తు పైకి చేరుకుని, అక్కడ్నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో శశిధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని దగ్గరలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శశిధర్ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

