మా నాన్నను చంపాలనే భద్రత తొలగింపు
తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపడానికే ఆయన భద్రతను ఉద్దేశపూర్వకంగా తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సోనియా జ్ఞాపకాల పుస్తకం గురించి మాట్లాడిన కొత్త వీడియోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యకు సంబంధించిన సంకేతాలు ముందే కనిపించాయని రాహుల్ పేర్కొన్నారు. ఆయన భద్రతపై చర్యలు తీసుకోకపోతే, చాలా త్వరలోనే ఆయన అంత్యక్రియలకు తాను తిరిగి రావాల్సి ఉంటుందని తన తల్లి సోనియాతో తాను చెప్పినట్లు తెలిపారు.
- రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపడానికే ఆయన భద్రతను ఉద్దేశపూర్వకంగా తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సోనియా జ్ఞాపకాల పుస్తకం గురించి మాట్లాడిన కొత్త వీడియోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యకు సంబంధించిన సంకేతాలు ముందే కనిపించాయని రాహుల్ పేర్కొన్నారు. ఆయన భద్రతపై చర్యలు తీసుకోకపోతే, చాలా త్వరలోనే ఆయన అంత్యక్రియలకు తాను తిరిగి రావాల్సి ఉంటుందని తన తల్లి సోనియాతో తాను చెప్పినట్లు తెలిపారు. చివరకు అదే జరిగిందన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. ‘ పాపా(నాన్న)ను చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.
భద్రత తొలగింపు కేవలం ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఆయనను చంపడానికే ఉద్దేశపూర్వకంగా చేశారు. ఆయన హత్యకు అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. ఏం జరుగుతున్నదో స్పష్టంగా కనిపించింది. నా తండ్రికీ ఈ విషయం చెప్పాను. అమ్మకూ చెప్పాను. దీనిపై నాన్నతో వాదించాను’ అని పేర్కొన్నారు. రాజీవ్ అనేక ఏండ్లు ఆయన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్నారు. 1991లో బీహార్‌లో జరిగిన ఒక సభలో తనకు ముప్పు ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

