గాడి తప్పిన అంగన్వాడీ!
ఖాళీ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం.. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొని రావడం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణాలోపం.. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యతాలోపం.. అధికారుల ఇష్టారాజ్యం.. వెరసీ రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ గాడి తప్పుతున్నది.
- నియామకాల్లో జాప్యం.. సిబ్బందిపై భారం
- ప్రహసనంలా 15,892 పోస్టుల భర్తీ ప్రక్రియ
- నోటిఫికేషన్లు ఇచ్చి చేతులుదులుపుకున్న సర్కార్
- సరుకుల సరఫరాలో జరుగుతున్న తీవ్ర జాప్యం
- ఇబ్బందుల్లో లబ్ధిదారులు.. ప్రజాధనం వృథా
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఖాళీ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం.. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొని రావడం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణాలోపం.. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యతాలోపం.. అధికారుల ఇష్టారాజ్యం.. వెరసీ రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ గాడి తప్పుతున్నది. అధికారులు, గుత్తేదార్ల కక్కుర్తికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో లబ్ధిదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మూడు సెంటర్ల బాధ్యతలను ఒకే టీచర్‌కు అప్పగించడంతో వారు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చినచోట హెల్పర్లను నియమించకపోవడంతో టీచర్లు చిన్నారులకు చదువు చెప్పడంతోపాటు వారి ఆలనాపాలనాచూడాల్సి వస్తున్నది.
ఖాళీ పోస్టుల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం
అంగన్వాడీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి గత మే నెలలో ప్రభుత్వం నియామక ప్రక్రియ ప్రారంభించింది. 3,100 టీచర్లు, 12,882 హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వం లో సెలెక్షన్ కమిటీలకు అప్పగించింది. ఈ ప్రక్రియ ప్రహసనంలా సాగుతున్నది. కొందరు కలెక్టర్లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఇన్చార్జీల బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో సుమారు 70వేల మంది పనిచేయాల్సి ఉండగా, 50 వేల మంది సిబ్బందే ఉన్నారు. దంతో ఒక్కో టీచర్‌కు రెండు, మూడు సెంటర్లకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు అందుబాటులో ఉండటం లేదని లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇన్‌చార్జ్‌లు చెబుతున్నారు. రోజువారీగా రికార్డుల్లో నమోదు చేయడం, లబ్ధిదారుల ఫింగర్ ప్రింటింగ్, ఫొటోలు తీయడానికే సమయం సరిపోతున్నదని అంటున్నారు.
పెద్దల అండతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడం, అధికార పార్టీ పెద్దల అండదండలతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ అప్పగించినా సరుకుల సరఫరాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. గతంలో కూరగాయలు మినహా కోడిగుడ్లతోపాటు ఇతర సరుకులు నెలలో ప్రతి పదిరోజులకోసారి సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం, గుత్తేదారులకు పెద్దల ప్రోద్బలం ఉండటంతో వారు 15, 20 రోజులకోసారి సరుకులు పంపిణీ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నాసిరకం, తక్కువ సైజు కలిగిన ఫుల్లెట్ కోడిగుడ్లను సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని అంగన్వాడీల యూనియన్లు మండిపడుతున్నాయి. కమీషన్లకు ఆశపడి కొందరు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

